మహిళలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారా?

Submitted by arun on Sat, 04/07/2018 - 14:38
professor

నిజమా... లేడీస్‌ జీన్స్‌ వేసుకోవద్దా? వేసుకుంటే నపుంసకులు పుడతారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు కేరళ ప్రొఫెసర్‌ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు? పుట్టకతోనే హిజ్రాలుగా పుడతారా? ఇంటర్‌ సెక్స్‌ అనే అరుదైన కేసుకు జీన్స్‌కు ఎందుకు లింక్‌ పెట్టారు?

పేరు డాక్టర్‌ రజిత్‌కుమార్‌. కేరళలో ప్రొఫెసర్‌. అధ్యాపక వృత్తిలో ఉన్న రజిత్‌కుమార్‌ అంత చదువుకొనీ ఇలా మాట్లాడరని చర్చించుకుంటుంది మహిళాలోకం. కేరళలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ తీసుకుంటున్న రజిత్‌కుమార్‌ తమను తీవ్రంగా అవమానంచారంటారు ట్రాన్స్‌జెండర్లు. 

కాసర్‌గోడ్‌లో ఓ కౌన్సలింగు సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు రజిత్‌కుమార్‌. జీన్స్ వేసుకుంటే తమ స్త్రీత్వాన్ని తామే దిగజార్చుకుంటారని, పురుషుడిలాగా స్త్రీ వస్త్రధారణ చేయడం వల్ల పుట్టే పిల్లలు కూడా రెండు లక్షణాలు అలవడుతాయంటూ మాట్లాడారాయన. ఇప్పటికీ ఇలా జీన్స్‌ వేసుకున్న మహిళల్లో 6 లక్షల మందికిపైగా ఇలాంటి వాళ్లు పుట్టారంటూ ఫినిషింగ్‌ టచ్‌ కూడా ఇచ్చారు. 

హెల్త్‌ పాయింట్‌ వ్యూలో ఆలోచిస్తే పుట్టుకతో ఎవరూ హిజ్రాలు కాలేరంటారు డాక్టర్లు. పుట్టుక సమయంలో ఆడ, మగ లాగే పుడతారు. అటు ఇటు కాకుండా ఇంటర్‌సెక్స్‌ అనేవి చాలా అరుదైన కేసులంటారు వైద్యులు. ప్రొఫెసర్‌ వ్యాఖ్యలపై కేరళ ప్రభుత్వం స్పందించింది. వైద్య, ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రొఫెసర్ రజిత్‌ ఇకపై ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ ఇష్యూ తర్వాత వెంటనే కళ్లు తెరిచిన రజిత్‌కుమార్‌... తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేరళలో పుట్టే ప్రతి పిల్లాడు ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడంలో తప్పేముందని చెప్పుకొచ్చాడు.

English Title
Women wearing jeans give birth to transgenders: Kerala professor

MORE FROM AUTHOR

RELATED ARTICLES