ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..?

ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..?
x
Highlights

రాంగోపాల్ వర్మ చుట్టూ.. జీఎస్టీ ఉచ్చు బిగుస్తోందా.? ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..? సీసీఎస్ పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి.? వర్మకు ఇప్పుడు...

రాంగోపాల్ వర్మ చుట్టూ.. జీఎస్టీ ఉచ్చు బిగుస్తోందా.? ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..? సీసీఎస్ పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి.? వర్మకు ఇప్పుడు శుక్రవారం టెన్షన్ పట్టుకుందా.?

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ మూవీ రాంగోపాల్ వర్మను చిక్కుల్లో పడేసింది. అసభ్యత, అశ్లీలతపై ఫిర్యాదు రావడంతో సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీంతో పాటు సామాజిక కార్యకర్త దేవిపై చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేపాయి. వీటన్నింటిపై ఈ మధ్యే వర్మను మూడున్నర గంటలు ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు 30 దాకా ప్రశ్నలు సంధించారు. కొన్నింటికి సమాధానం చెప్పేందుకు వర్మ కొంత టైం కోరారు. దీంతో ఆయనకు మళ్లీ నోటీసులిచ్చి శుక్రవారం విచారణకు రావాలని చెప్పారు.

ఇప్పటికే వర్మ ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపిన పోలీసులు ఆధారాలు పక్కాగా ఉండేలా చూస్తున్నారు. వర్మ చెప్పినట్లు జీఎస్టీ షూటింగ్ పోలండ్‌‌లో జరిగితే ఆ టైంలో ఆయన ఎక్కడున్నారనే దానిపై పాస్‌పోర్ట్ చెక్ చేస్తున్నారు. ఇక స్కైప్ ద్వారా జీఎస్టీకి డైరెక్షన్ చేశానని వర్మ చెప్తున్నందున ఆ వివరాల కోసం స్కైప్ నిర్వాహకులకు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు.

సత్యమేవజయతేను కించపరిచేలా ఆర్జీవీ చేసిన ట్వీటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగిసేలా చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త దేవిపై మీడియాలో వర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. జీఎస్టీ మూవీ విదేశాల్లో తీసింది కాబట్టి దానిపై చర్యలు తీసుకోవటానికి ఇక్కడి పోలీసులకు అధికారం ఉండదన్న వర్మ వాదన తప్పేనని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాలపైన న్యాయనిపుణులతో చర్చించిన అధికారులు వర్మపై చర్యలకు రెడీ అవుతున్నారు.

శుక్రవారం సీసీఎస్ పోలీసుల ప్రశ్నలకు.. వర్మ ఇచ్చే సమాధానాలే ఆయన అరెస్ట్‌‌పై క్లారిటీ ఇవ్వనున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణలో పడిన వర్మ.. జీఎస్టీ కేసు నుంచి బయటపడేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories