15 ఏళ్ల బాలుడితో 29 ఏళ్ల టీచర్..జంప్ !

Submitted by arun on Tue, 07/24/2018 - 17:42
woman teacher

పదో తరగతి పిల్లాడిని తీసుకొని 29 ఏళ్ల స్కూల్ టీచర్వెళ్లిపోయింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. చివరికి విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ పంతులమ్మను అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫతేబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.  ఫతేబాద్‌లోని ఓ స్కూల్లో పాఠాలు బోధిస్తున్న 29 ఏళ్ల పంతులమ్మ పదో తరగతి చదువుతున్న15 ఏళ్ల  పిల్లాడిని ప్రేమించింది. ఫోన్లో మెసేజీలు, వీడియోలు పంపుతూ ప్రేమపాఠాలు బోధించింది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గత శుక్రవారం ఇద్దరూ ఊరి నుంచి వెళ్లి పోయారు. సదరు బాలకుడు పత్తా లేకుండా పోవడంతో తల్లిదండ్రులు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూలుకెళ్లి విచారించారు. దీంతో అసలు విషయం తెలిసింది. ప్రేమజంట ఫోన్ల ఆధారంగా పోలీసులు వారు ఎక్కడున్నారో గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. తాము మొదట ఢిల్లీకి వెళ్లామని, తర్వాత కశ్మీర్‌లో పర్యటించామని టీచర్ చెప్పింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉంది.
 

English Title
woman teacher elopes with 15 year old student arrested

MORE FROM AUTHOR

RELATED ARTICLES