చావడానికి దూకితే...

Submitted by arun on Mon, 06/25/2018 - 12:52
railway trak

రెండు నెలల తన బిడ్డతో సహా రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళ చిన్న గాయమైనా కాకుండా ప్రాణాలతో బయటపడింది. ఆమెపై నుంచి రైలు వెళ్లినా బతికి బట్టకట్టడం విశేషం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ రైల్వే స్టేషన్‌లో శనివారం నాడు చోటుచేసుకుంది.  ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 
తన పేరు తబాస్సుమ్‌ అని, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నానని, ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో బిడ్డతో కలిసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నానని వివరించింది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు సఖి సెంటర్‌కు తరలించి, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు.   

English Title
Woman, infant escape unhurt after train passes over them in Madhya Pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES