కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Submitted by arun on Fri, 06/15/2018 - 12:24
crime

కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులుగా రసజ్ఞ అతడికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది. విషయం తెలుసుకున్న వంశీధర్ మీసేవా కేంద్రానికి చేరుకుని కొడవలితో యువతిపై ఒక్కసారి దాడికి తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన మీసేవా నిర్వాహకులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English Title
woman brutally murdered karimnagar

MORE FROM AUTHOR

RELATED ARTICLES