ఓ సినిమా చేయండి బాసూ

Submitted by lakshman on Thu, 02/08/2018 - 04:36
Nagarjuna and Chiranjeevi

కేవలం నటుడిగానే గాక దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు ధనుష్. ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ నుసొంతం చేసుకున్నాడు ధనుష్. ఆ సినిమా అనంతరం.. ఇప్పుడు మరోసారి దర్శకత్వానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సారి ఒక భారీ సినిమాతో మొత్తం దక్షిణాదిన అంతా సత్తా చాటాలనేది ధనుష్ ప్రణాళిక అని తెలుస్తోంది. అందుకే.. మల్టీస్టారర్ ను, అందునా.. పక్క భాష నటులను కలుపుకుని సినిమా చేయాలని ధనుష్ ప్లాన్ వేశాడట.

అందుకోసం టాప్ స్టార్స్ ను సంప్రదించే పనిలో ఉన్నాడట రజనీకాంత్ అల్లుడు. తను రూపొందించదలిచిన సినిమా కోసం.. మెగాస్టార్ చిరంజీవిని పరిగణనలోకి తీసుకున్నాడట ధనుష్. ఈ మేరకు తను నటించి, దర్శకత్వం వహించే సినిమాలో నటించాలని మెగాస్టార్ ను కోరాడట. అయితే.. ఈ ప్రతిపాదనను చిరంజీవి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం తను ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నాను అని.. వేరే సినిమాకు డేట్స్ కేటాయించే పరిస్థితి లేదని చిరంజీవి చెప్పినట్టుగా టాక్.

దీంతో ఇప్పుడు మరో తెలుగు హీరోపై కన్నేశాడట ధనుష్. అది మరెవరి మీదో కాదు... నాగార్జున మీద. నాగార్జునను తన సినిమాలో నటింపజేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇది వరకూ కూడా తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు నాగార్జున. ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో ప్రయోగాత్మక సినిమాలో చేయడానికి సై అంటాడా? మల్టీ స్టారర్ సినిమాలు చేసే ఉత్సాహాన్ని కలిగి ఉండే నాగ్ ధనుష్ కు ఓకే చెప్పినా చెప్పవచ్చునేమో

English Title
Will it be Nagarjuna or Chiranjeevi in Dhanush's upcoming directorial

MORE FROM AUTHOR

RELATED ARTICLES