యుద్దంలోకి దిగితే గెలిచి తీరాల్సిందే

Submitted by arun on Tue, 12/26/2017 - 11:43
Rajinikanth

కలలో కూడా హీరో అవుతానని ఊహించలేదన్నారు ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో సమావేశమయ్యారు. సినిమా రంగంలోకి వస్తానని అనుకోలేదన్న తలైవా బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేశారని చెప్పారు. యుద్దంలోకి దిగితే గెలిచి తీరాల్సిందేనని ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తన పొలిటికల్‌ ఎంట్రీపై తనకంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉందన్న రజనీ రాజకీయాలపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు కొత్త కాదన్న తలైవా 1996 నుంచి పాలిటిక్స్‌ చూస్తున్నానని చెప్పారు. 

English Title
Will Announce My Political Decision On Dec 31

MORE FROM AUTHOR

RELATED ARTICLES