తన పోటీపై స్పష్టత ఇచ్చిన విజయశాంతి

Submitted by nanireddy on Tue, 11/13/2018 - 21:39
vijayashanthi-says-she-not-contesting-telangana-assembly-elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను లేనని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు.ఇవాళ (మంగళవారం) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడంలేదని వస్తున్న వార్తలో వాస్తవం లేదని.. తనకే పోటీ చేయడం ఇష్టం లేదన్నారు. ఇందుకు బలమైన కారణం తాను స్టార్‌ క్యాంపెయినర్‌గా బాధ్యతలు చూస్తుండటం వల్లేనని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తానని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే విజయశాంతి మెదక్ లేదా దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా పోటీభరి నుంచి తప్పుకున్నారు. 2009 లో మెదక్ నుంచి తెరాస తరుపున ఎంపీగా గెలిచిన విజయశాంతి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.

English Title
vijayashanthi-says-she-not-contesting-telangana-assembly-elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES