ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు : వెంకయ్య

Submitted by arun on Thu, 03/29/2018 - 12:33

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్టీఆర్‌....బయోపిక్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్‌లో....ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు షూటింగ్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కు తేజ దర్శకత్వం వహిస్తుండగా...బుర్రా సాయిమాధవ్‌ మాటలు, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్, వారాహి చలనచత్రం, విబ్రీ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయ్. 

తెలుగుఖ్యాతిని ప్రపంచమంతా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు,  సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజుగా వెంకయ్య అభివర్ణించార ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు వారంతా తెలుగులో మాట్లాడడమే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎన్టీఆర్‌ బయోపిక్ ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు.

English Title
Venkaiah Naidu Speech NTR Biopic Launch

MORE FROM AUTHOR

RELATED ARTICLES