మహేశ్‌ బాబుని కలసిన సీఎం

Submitted by arun on Mon, 06/18/2018 - 16:33
mahesh

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కలిశారు. మహేశ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్‌ కోసం డెహ్రాడూన్‌ వెళ్లారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్‌ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్‌ అనే నేను చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన  సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (సోమ‌వారం) మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఈ షూటింగ్ కోసం డెహ్రాడూన్ వ‌చ్చిన మ‌హేష్‌ను ఉత్తరాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ క‌లిశారు. మ‌హేష్‌తో ఉత్త‌రాఖండ్ సీఎం మ‌ర్యాద‌పూర్వకంగానే స‌మావేశ‌మైన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

English Title
uttarakhand cm meets mahesh babu on sets in dehradun

MORE FROM AUTHOR

RELATED ARTICLES