తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టం

తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టం
x
Highlights

తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టమ్ చేపట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల్లో ఓటమి కారణాలేంటి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టమ్ చేపట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల్లో ఓటమి కారణాలేంటి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ సమీక్ష మొదలుపెట్టింది. పార్టీ సీనియర్ నేతలతో పాటు పోటీ చేసిన అభ్యర్థులందరూ గాంధీభవన్‌లో సమావేశానికి హాజరయ్యారు. ఓటమికి కారణాలతో పాటు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆధారాలను సేకరించడంపై కూడా టీపీసీసీ నేతలు దృష్టి పెట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ ఫలితం పొందలేకపోయామని.. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భావించిన కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. దీంతో హస్తం నేతలు ఓటమికి కారణాలపై సమీక్ష చేపట్టారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకు ఇంత ఓటమిని సవిచూడాల్సి వచ్చిందనే దానిపై టీకాంగ్రెస్ పోస్టుమార్టమ్ మొదలుపెట్టింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్లు, అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించారు. జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈవీఎంలే కొంపముంచాయని భావిస్తున్న నేతలు ఈవీఎంలతో ఎదురైన ఇబ్బందులపై పక్కా ఆధారాలు సేకరించడంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.

టీడీపీతో పొత్తే కొంపముంచిందని తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రిపోర్టు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాహుల్‌కు నివేదికను ఇచ్చిన ఆ నేత.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, పీసీసీ చీఫ్ సహా కార్యవర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాకతో తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ బాబుగా మారిందని కూడా వివరణ ఇచ్చారు. మరోవైపు, టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు.. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉత్తమ్, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలెందుకు తీసుకోకూడదని క్రమశిక్షణ సంఘం ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories