ముద్దిచ్చిన భర్త నాలుకను కొరికిన భార్య...

Submitted by arun on Mon, 09/24/2018 - 12:47
wife bites off man’s tongue

గొడవకు దిగిన భార్యను శాంతింపచేసేందుకు భర్త చేసిన ప్రయత్నం అతడి నాలుకకు ఎసరు తెచ్చింది. ముద్దిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తను ఇదే అదనుగా భావించిన భార్య అతడి నాలుకను కొరికేసింది. ఢిల్లీలోని రణహోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రణహోలా ప్రాంతానికి చెందిన కరణ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్నాడు. కరణ్ పెళ్లి అయి రెండేళ్లు గడచినా అతని భార్య భర్తతో వైవాహిక జీవితంపై అసంతృప్తిగా ఉండేది. తరచూ భార్య భర్త కరణ్ తో గొడవలు పడుతుండేది. రాత్రి ఇంటికి వచ్చిన భర్త కరణ్ తో అతని భార్య గొడవపడింది. ఇద్దరు గొడవపడుతుండగా, భార్య ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భర్త కరణ్ భార్యకు ముద్దిచ్చాడు. అంతే ఇదే అదనుగా భావించిన భార్య ఆగ్రహంతో భర్త కరణ్ నాలుకను కొరికేసింది. బాధితుడి తం‍డ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపుతోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితుడు మాట్లాడే అవకాశం లేదని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెలిపారు.
 

English Title
Unhappy with married life, wife bites off man’s tongue

MORE FROM AUTHOR

RELATED ARTICLES