పూటుగా మ‌ద్యం సేవించి డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ యాంక‌ర్ ప్ర‌దీప్

x
Highlights

తెలుగురాష్ట్రాల్లో న్యూఇయ‌ర్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. అయితే హైద‌రాబాద్ లో కొత్త‌సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ తనిఖీల్లో...

తెలుగురాష్ట్రాల్లో న్యూఇయ‌ర్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. అయితే హైద‌రాబాద్ లో కొత్త‌సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ తనిఖీల్లో ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టుడు ప్ర‌దీప్ డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో రాత్రి 3 గంటల సమయంలో పూటుగా తాగిన ప్ర‌దీప్ కారున‌డుపుకుంటూ వ‌స్తుండ‌గా ట్రాఫిక్ పోలీసులు అడ్డ‌గించి బ్రీత్ ఎన‌లైజ‌ర్ చెక్ చేశారు. అయితే ఈ టెస్ట్ లో ప్ర‌దీప్ కు 178పాయింట్లు వ‌చ్చాయి. దీంతో ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ పోలీసుల నిబంధ‌న‌ల ప్ర‌కారం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధించే అవ‌కాశం ఉంది. మ‌రి పోలీసుల నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించిన ప్ర‌దీప్ కు కూడా అదేత‌ర‌హా శిక్ష విధించే అవ‌కాశం ఉంది. ఇక వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories