తులసి ఆకులతో క్యాన్సర్ కు చెక్..?

Submitted by arun on Fri, 06/29/2018 - 11:43

తులసి భారతదేశంలోని హిందూవుల్లోని ప్రతి ఇంటా కనిపిస్తుంది. ఉదయం లేవగానే తులసి చెట్టు చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అంతేకాదు ప్రతి రోజు తులసి చెట్టుకు పూజలు హిందూవుల సంస్కృతి. అలాంటి తులసి ఆకులో క్యాన్సర్‌ను నయం చేసే లక్షణాలు ఉన్నాయా ? వరంగల్‌ జిల్లాలోని నిట్‌ విద్యార్థుల పరిశోధనలో ఏం తేలింది. తులసి మొక్క గురించి విద్యార్థులు ఏం చెబుతున్నారు. 

క్యాన్సర్‌ ఎంతో భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే కోలుకోవడం అంత సులభం కాదు. క్యాన్సర్‌ బారిన పడిన సెలబ్రెటీలు సైతం వ్యాధి నుంచి బయట పడేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరికి కొంత మంది క్యాన్సర్‌ను జయించారు. అయితే తులసి మొక్కపై వరంగల్‌ జిల్లాలోని నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. చివరికి విద్యార్థుల ప్రయత్నం ఫలించింది. తులసి ఆకుల్లో లక్షల సంఖ్యలో ఉండే విభిన్న సూక్ష్మజీవుల్లో 35 రకాలపై నిట్ పరిశోధక బృందం ప్రయోగాలు చేసింది. పరిశోధనల్లో బాలిసిల్లస్‌ స్ట్రాటో స్పెరికస్‌ గుర్తించారు. వీటిలో నుంచి ఎల్‌-ఆస్పరాగినేస్‌, ఎల్‌-గ్లుటామినేస్ అనే ఎంజైములను వెలికి తీశారు. వీటిని వివిధ దశల్లో అభివృద్ది చేసి అక్యూట్‌ లింపోసిటిక్‌ లుకేమియా అనే క్యాన్సర్‌ను నియంత్రించే ఔషధాన్ని తయారు చేశారు. ఈ ఔషధంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. దీనిని త్వరలో ఎలుకలపై ప్రయోగించిన తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత మనుషులకు ఉపకరిస్తుందని పరిశోధకులు సతీశ్‌ తెలిపారు.

తులసి మొక్కలో క్యాన్సర్ ఔషధాన్ని గుర్తించడంతో పాటు మరో కోణంపై కూడా పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆహారంపై అక్యూట్‌ లింపోసిటిక్‌ లుకేమియా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. వివిధ స్థాయిల్లో జరిగే పరిశోదనలకు తొలిమేట్టగా భావించే ఎంజైమ్స్ రంగులు మారడాన్ని ఫస్ట్ గుర్తించామని పరిశోధక విద్యార్థులు చెబుతున్నారు.  

English Title
Tulsi Leaves Can Help Fight Cancer Says a Research

MORE FROM AUTHOR

RELATED ARTICLES