ఆర్కేనగర్‌ ఎమ్మెల్యేగా దినకరన్‌ ప్రమాణస్వీకారం

Submitted by arun on Fri, 12/29/2017 - 17:06
TTV Dinakaran

తమిళనాడు ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన టీటీవీ దినకరన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంచేశారు. అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్ దినకరన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆర్కేనగర్‌ పర్యటనకు దినకరన్‌ బయల్దేరి వెళ్లారు. జనవరి 8నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి సమావేశాలకు దినకరన్‌‌ కూడా హాజరుకానుండటంతో అసెంబ్లీ సెషన్స్‌ వాడివేడిగా జరగనున్నాయి. అధికార పార్టీ అన్నాడీఎంకేలో అనైక్యతతో సమావేశాలు రక్తికట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇక 18మంది దినకరన్‌ ఎమ్మెల్యేలతో అనర్హత వేటు వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దాంతో వాళ్లు ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా? ఒకవేళ హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.  

English Title
TTV Dinakaran takes oath as MLA from R K Nagar

MORE FROM AUTHOR

RELATED ARTICLES