దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్‌ కూలిపోతుంది

Submitted by arun on Sun, 12/24/2017 - 12:07
TTV Dinakaran

ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో స్థానంలో అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదన్, మూడో స్థానంలో డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్ ఉన్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూస్తే అన్నాడీఎంకే అభ్యర్థికి 9672, డీఎంకే అభ్యర్థికి 5091, ఇండిపెండెంట్ అభ్యర్థి దినకరన్‌‌కు 20,298 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఐదో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని, ఇది తమిళ ప్రజల తీర్పు అని దినకరన్ పేర్కొన్నారు. 
 

English Title
TTV Dinakaran Set for Big Win

MORE FROM AUTHOR

RELATED ARTICLES