కంగ్రాట్స్ రజనీకాంత్..హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలో రాజీనామా : ర‌జ‌నీ

Submitted by arun on Sun, 12/31/2017 - 13:09
Rajinikanth

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. రజనీ రాజకీయ ప్రవేశాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ఈ సందర్భంగా నా సోదరుడు రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కమల్ హాసన్ చెప్పారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ రాజ‌కీయంపై ఆరు రోజుల పాటు త‌న అభిమానుల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్ర‌వేశంపై డిసెంబ‌ర్ 31న ప్ర‌క‌టిస్తాన‌న్న ఆయ‌న‌, సినీ రంగంలో ఎదిగిన తీరు. సూప‌ర్ స్టార్ గా మ‌లిచిన ద‌ర్శ‌క, నిర్మాత‌ల్ని కొనియాడారు. అయితే చివరిరోజు అయిన ఆదివారం రోజు  తన అభిమానులతో సమావేశమైన రజనీకాంత్.. రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాజులు దండయాత్రలు చేసిన దోచుకున్నట్లు ఇప్పుడున్న పార్టీలు అధికారం పేరుతో ప్రజలను లూటీ చేస్తున్నాయని అన్నారు.

అంతేకాదు రాజకీయాలు నాశనమయ్యాయంటూ పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్‌లను విమర్శించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని... నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను. నేను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంద‌ని సూచించారు. 

English Title
‘Truth, work and growth will be the mantras of our party’ says Rajinikanth

MORE FROM AUTHOR

RELATED ARTICLES