బరితెగించిన విప్ నల్లాల ఓదేలు

Submitted by arun on Mon, 04/09/2018 - 16:22

ప్రభుత్వ విప్.. నల్లాల ఓదేలు బరితెగించారు. న్యాయం చేయమని అడిగితే.. బెదిరింపులకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన దళిత రైతు రాజయ్య భూమిని.. ఓదేలు అనుచరులు ఆక్రమించారు. అయితే కబ్జాలో ఉన్న తన భూమిని ఇవ్వాలని ఓదేలును ఆశ్రయిస్తే.. బాధితుడిపై ఆయన బెదిరింపులకు దిగారు. బండ బూతులు తిడుతూ.. అధికార అహంకారాన్ని ప్రదర్శించారు. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమ్మని తేగేసి చెప్పాడు. నీ వల్లే ఏం కాదంటూ ఫోన్‌లో బెదిరించిన ఆడియో.. ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరితే.. దుర్భషలాడారని రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే రాజయ్య చెప్పేదంతా అబద్దమని.. విప్ ఓదేలు చెబుతున్నారు. 

English Title
TRS MLA Nallala Odelu Abuse On Phone Call

MORE FROM AUTHOR

RELATED ARTICLES