కెసీఆర్‌ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్

x
Highlights

కెసిఆర్ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు మూడువేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తాం అని కెటిఆర్‌ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సిరిసిల్ల...

కెసిఆర్ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు మూడువేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తాం అని కెటిఆర్‌ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సిరిసిల్ల ఫంక్షన్ హాల్ లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే, చేసుకున్న వారికి ఇచ్చే పారితోషకం లక్ష రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో బదిరులకు స్మార్ట్ ఫోన్ లు, లిపి పుస్తకాలను అందించామని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం పది కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క దివ్యాంగుడు సైనికునిగా పని చేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories