టీఆర్ఎస్ లో గళం విప్పిన అసంతృప్త నేతలు...సంతంత్రంగా బరిలోకి...

టీఆర్ఎస్ లో గళం విప్పిన అసంతృప్త నేతలు...సంతంత్రంగా బరిలోకి...
x
Highlights

టీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కని అసంతృప్త నేతలు తమ గళాన్ని విప్పుతున్నారు. తమ అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు స్వతంత్రంగా...

టీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కని అసంతృప్త నేతలు తమ గళాన్ని విప్పుతున్నారు. తమ అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట సమితిలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై అసంతృప్త నేతలు అధిష్టానానికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్నవారు అధిష్టానంపై మండిపడుతున్నారు. పటాన్ చెరువు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే తిరిగి కేటాయించడంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గాలి అనీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తానని తెలిపారు.

నారాణ్ ఖేడ్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అసమ్మతి వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉద్యమంలో కష్టపడిన వారిని గుర్తించకుండా టిక్కెట్లు కేటాయించారంటూ ఆరోపించారు. చెన్నూరు టికెట్ ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించడంపై కేసీఆర్ పునరాలోచించి.. తనకే టికెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నానన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. బాల్కా సుమన్ తో కలిసి పని చేస్తానని తాను చెప్పలేదన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ లో అసమ్మతి వ్యక్తం మవుతోంది. మాధవరం కృష్ణారావుకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తేళ్ల నర్సింగ్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉప్పల్ అభ్యర్ధి భేతీ సుభాష్ రెడ్డిని మార్చాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

భూపాలపల్లి టిక్కెట్ ఆశించిన గండ్రసత్య నారాయణ రావు కూడా స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజల అండదండలే తనను గెలిపిస్తాయని విశ్వాసంవ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జనగామ టిక్కెట్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వడాన్ని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కోసం ఆశావాదులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్ధినంటూ ప్రకటించుకుంటున్నారు. ఆర్యవైశ్యులకు ఈ స్థానం కేటాయించాలని కోరుతున్నారు. టికెట్ల కేటాయింపుతో అలకబూనిన అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు టీఆర్ఎస్ నేతలు. త్వరలోనే పార్టీలో అసంతృప్తి సమసిపోతుందని పార్టీ అధిష్టానం ధీమావ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories