కూటమికి 55 వస్తాయని.. మిగిలిన సీట్లు..

కూటమికి 55 వస్తాయని.. మిగిలిన సీట్లు..
x
Highlights

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. 9 నెలల ముందుగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని చెబుతున్నాయి వివిధ పార్టీలు. 100...

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. 9 నెలల ముందుగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని చెబుతున్నాయి వివిధ పార్టీలు. 100 సీట్లు సాధిస్తామని తెరాస చెబుతుంటే.. లగడపాటి సర్వే నిజమవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమకు 65 నుంచి 70 సీట్లు వస్తాయని అంచనా వేసుకుంటుంది. ఈ క్రమంలో హంగ్ వస్తే తామే ముఖ్యమంత్రి అవుతామని మజ్లీస్ పార్టీ చెబుతోంది. ఇందుకు కర్ణాటకయే తమకు ఆదర్శమని చెబుతోంది. ఇక అధికార రేసులో తాము లేమని చెప్పకనే చెప్పారు బీజేపీ నేతలు. కానీ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్న బీజేపీ సహకారం ఉండాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేస్తున్నారు. ఇదిలావుంటే ఈసారి భారీగానే ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

8 నుంచి 12 మందిదాకా ఇండిపెండెంట్లు గెలుస్తారని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అయితే వీరందరూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. అంతేకాదు సొంతంగా తమకు 45 సీట్లు, మిత్ర పక్షం టీడీపీకి 5 నుంచి 9 సీట్లు వస్తాయని అలాగే టిజెఎస్ కు 2 నుంచి 3 , సిపిఐకి 1 స్థానం దక్కినా మొత్తం అటు ఇటుగా కూటమికి 55 వరకు వస్తాయని అంచనా వేసుకుంటోంది కాంగ్రెస్. ఇక అధికారానికి కావలసిన అరకొర సీట్లు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తారని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు సొంతంగా అధికారాన్ని చేపడతామని టీఆరెస్ చెబుతోంది. పెరిగిన పోలింగ్ శాతం మాకు కలిసొస్తుందని కేటీఆర్ అంటున్నారు. వంద స్థానాల్లో తమకు విజయం దక్కుతుందని జోస్యం చెప్పారు. మరి ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో రేపు తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories