టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకురాలు కన్నుమూత

Submitted by nanireddy on Fri, 08/31/2018 - 07:54
tollywood-lady-director-ba-jaya-passed-away

రెండురోజుల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ మరణించారన్న దుర్వార్త మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్‌ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించిన జయ జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి 'సూపర్‌ హిట్‌' అనే సినీవారపత్రికకు జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు జయ. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రానికి గాను సిల్వర్‌ క్రౌన్‌ అవార్డ్‌ను అందుకున్నారు.

English Title
tollywood-lady-director-ba-jaya-passed-away

MORE FROM AUTHOR

RELATED ARTICLES