మహానటి గురించి ఎవరి మాట ఏంటి?

మహానటి గురించి ఎవరి మాట ఏంటి?
x
Highlights

ఎన్టీఆర్,ఏఎన్నార్ టాలీవుడ్ లెజండరీ యాక్టర్స్.నటిగా వాళ్ల సరసన చోటు దక్కించుకున్నమహానటి సావిత్రి.అందం,అభినయంలో తనకు సాటి లేదనిపించుకున్న వెండితెర...

ఎన్టీఆర్,ఏఎన్నార్ టాలీవుడ్ లెజండరీ యాక్టర్స్.నటిగా వాళ్ల సరసన చోటు దక్కించుకున్నమహానటి సావిత్రి.అందం,అభినయంలో తనకు సాటి లేదనిపించుకున్న వెండితెర జాబిలి సావిత్రి జీవిత కథను సినిమాగా కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వం అందించిన ఈసినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసింది.మహానటి ఆడియో రిలీజ్ సందర్భంగా సావిత్రి పై నటీనటులు వెళ్లుబుచ్చిన వారి అభిప్రాయాలేంటో ఓసారి చూద్దాం.

స్టేజ్‌మీద నిలబడి సావిత్రి గొప్పదనం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు జూ.ఎన్టీఆర్.బహుశా ఎన్ని జన్మలెత్తినా రాదేమో.సావిత్రి గారే నిజమైన సూపర్‌స్టార్‌.ఆ మహానటి జీవిత కథ తెలుసుకోవడం చాలా అవసరం అన్నాడు తారక్.ఆడవాళ్ల బలం ఏంటో చెప్పే సినిమా ఇది.మహానటి’లో తాతగారి పాత్ర చేయమని అడిగారు.కానీ ఆయన పాత్రను పోషించేంత ధైర్యం నాకు లేదని చెప్పానన్నాడు ఎన్టీఆర్.

మహానటి సినిమాలో నటించనందుకు బాధగా ఉందన్నాడు నాగార్జున.‘ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి ఈ మూడు పేర్ల తెలుగు సినీ చరిత్రలో మిగిలిపోతాయి.వాళ్లు లేకుండా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలూ లేవు.సావిత్రి గారే తనను చిన్నప్పుడు ఎత్తుకుని చిత్రసీమకు పరిచయం చేశారు.సావిత్రి బయోపిక్ తెలుగు సినిమా..ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం అన్నాడు నాగ్.

సావిత్రి గురించి మాట్లాడే అర్షత,వయస్సు లేదన్నాడు హీరో నాని.సావిత్రిలా నటించేందుకు కీర్తీ సురేశ్ ఎంతో కష్టపడింది.ఇందులో తాను యాక్ట్‌ చేయాల్సింది.కానీ కుదర్లేదు అన్నాడు నాని. సావిత్రి పాత్రకు తనను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉందంది హీరోయిన్ కీర్తి సురేశ్.దర్శకుడు నాగ్ అశ్విన్,స్వప్న తనను అడిగినప్పుడు ‘నా వల్ల కాదని చెప్పేశా.ఐనా పట్టుబట్టారు.నాకున్న చాలా సందేహాలను తీర్చి,తనను సినిమాకు ఒప్పించారు.సావిత్రి పాత్ర కోసం తన పేరును రిఫర్ చేసిన నానికి కృతజ్ఞతలు తెలిపింది కీర్తి...

సావిత్రి బయోపిక్ లో మెయిన్‌ హీరోయిన్‌ కానప్పటికీ ప్రౌడ్ గా ఫీలవుతున్నా అంది సమంత.కచ్చితంగా చెప్పాల్సిన కథలో భాగమవ్వాలనే సినిమా ఒప్పుకున్నాను.నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.కీర్తీ ట్రాన్సఫర్మేషన్‌ చూసి షాక్‌ అయ్యాను అన్నారు సమంత. సావిత్రి బయోపిక్ కోసం రెండేళ్లు పరిశోధన చేశానన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.ఇది లోతైన కథ.హిమాలయాలు ఎక్కినంత పని ఐంది.సినిమా చేసేందుకు అనుమతినిచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.సెట్లో సావిత్రిగారున్నారేమో అనే భావనతో పనిచేశామన్నాడు దర్శకుడు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో హిమాలయాలకు తీసుకెళ్లాడు.మళ్లీ సావిత్రి మూవీతో 80లోకి తీసుకువెళ్లాడన్నాడు విజయ్ దేవరకొండ.విజయ్ ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ గా నటించాడు.ఇందులో చిన్న పాత్ర చేయడం హ్యాపీగా ఉందన్నాడు.. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్ర లో దుల్కర్ సల్మాన్ నటించాడు.సావిత్రికి తాను వీరాభిమానిని,,వాళ్ల కథల్ని తెరపై తీసుకురావడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉందన్నాడు దుల్కర్ సల్మాన్.దర్శకుడు నాగ్ అశ్విన్ రెండో సినిమాకే ఇంత డేర్ చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదన్నాడు.. మహానటి సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా మంది,,చాలా ప్రశ్నలడిగారన్నారు నిర్మాత స్వప్నా దత్‌.సెన్సేషన్‌ కోసమా?అది వర్కౌట్‌ అవుతుందా?అన్నారు.కానీ సావిత్రిపై ఉన్న అభిమానంతో సినిమా చేశామన్నారు.

తన సినిమా నట ప్రస్థానం సావిత్రి గారి మూవీతోనే మొదలైందన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.పాండవ వనవాసం సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాను.మహానటి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు. సావిత్రి జీవిత కథని డాక్యుమెంటరీగా తీసినా 60గంటలొస్తుంది.అలాంటి కథలో ఆరు పాటలు పెట్టాల్సిన అవసరం ఏమిటి అనే విషయంపై ఓ తపస్సే జరిగింది.కీర్తి సురేష్‌ని చూస్తే సావిత్రిగారు ఆమెలోకి వచ్చారా?అనిపిస్తుంది. కీర్తి సురేష్‌ సావిత్రి నెం.2 గా కనిపిస్తారన్నారు. వెండితెరకే వెలుగు నింపిన మహానటి సావిత్రి బయోపిక్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.మహానటి సినిమాలో సావిత్రి తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటుల పాత్రలు ఇందులో ఆవిస్క్ క్రుతం కాబోతున్నాయి.మరి ఈనెల 9న వస్తోన్న మహానటి సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories