రేపు కాంగ్రెస్ మూడో విడత జాబిత విడుదల

Submitted by chandram on Fri, 11/16/2018 - 19:44


కాంగ్రెస్‌ తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యిందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా తెలిపారు. పొత్తుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చిందని చెప్పిన కుంతియా టీజేఎస్‌కు 8 సీట్లు కేటాయిచినట్టు వివరించారు. కొన్ని స్థానాల్లో మాత్రమే సందిగ్ధత ఉందని అది కూడా రేపటిలోగా క్లియర్‌ అవుతుందన్నారు. పొన్నాల సీటుపైనా కుంతియా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పొన్నాల సీనియర్‌ నాయకుడని సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయని రేపు తుది జాబితా విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా అన్నారు. పొత్తులపై చర్చ జరిగిందని టీజేఎస్‌కు 8 సీట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. కొన్ని స్థానాల్లో మాత్రమే అభ్యర్థులపై సందిగ్ధత ఉందన్న కుంతియా.. ఎన్నికల్లో అసంతృప్తులు కామన్‌గానే ఉంటారని చెప్పుకొచ్చారు. మరోవైపు జనగాంలో పొన్నాల పోటీపైనా కుంతియా క్లారిటీ ఇచ్చారు. 

English Title
Telangana Congress in-charge Kunthiya Clarity on Congress Final List

MORE FROM AUTHOR

RELATED ARTICLES