హస్తరేఖల్ని మార్చే గెలుపు గుర్రాల అన్వేషణ 

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:45
TELANGANA CONGRESS

రయ్యిమంటూ దూసుకెళ్తున్న కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్‌ టార్గెట్‌గా చేస్తున్న ప్రచారం ఫలితాన్ని ఇస్తోందని ఆశిస్తున్న నేతలు ... వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది.  ఎన్నికల కమిటీ జాబితా ఆధారంగా  గెలుపు గుర్రాల‌ను వెతికి ప‌ట్టుకునేందుకు స్క్రీనింగ్ క‌మిటి రంగంలోకి దిగింది. దీంతో హస్తం నేతల చూపు  స్క్రీనింగ్ కమిటిపై పడింది.


అదిగో ఇదిగో అంటూ  రోజుకో డేట్ , గంటకో ముహూర్తం ప్రకటిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపికపై తీవ్ర స్ధాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్న హస్తం నేతలు ... టికేట్ల కేటాయింపుపై దృష్టి సారించారు. అధికార పార్టీ అభ్యర్ధులను ధీటుగా ఎదుర్కోనే వారిని ఎంపిక చేసే బాధ్యతను  స్క్రీనింగ్ కమిటీ తలకెత్తుకుంది.  

11 వందలకు పైగా కూడిన జాబితాను పీసీసీ కమిటీ ఎన్నికల కమిటీ మూడు గ్రూపులు విభజించింది. నియోజకవర్గాలను బట్టి ఈక్వెషన్లను రూపొందించిన కమిటి సభ్యులు  నియోజ‌కవ‌ర్గానికి ముగ్గురిని ఎంపిక చేసింది.  మొత్తం 119 స్ధానాలకు గాను 35 చోట్ల సీినియర్లు ఉన్నారని ..వీరికి కేటాయింపులో ఎలాంటి వివాదాలు లేవని తేల్చింది.  ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్ధులు పోటీ పడుతున్న  స్ధానాలు అధికంగా ఉండటంతో  ఎంపిక బాధ్యతను స్క్రీనింగ్ క‌మీటికి అప్పగించారు. 

గోల్కొండ రిసార్ట్  భ‌క్తచ‌ర‌ణ్ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ క‌మిటీ  పీసీసీ జాబితాను పరిశీలించింది. కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయిన సీనియర్ నేతలు జానా, ఉత్తమ్‌, డీకే అరుణ, కోమటి రెడ్డిలు తమ వర్గాలకు చెందిన నేతల జాబితాతో పాటు తాము స్వయంగా నిర్వహించిన సర్వేల వివరాలను అందజేసినట్టు సమాచారం. 

English Title
TELANGANA CONGRESS

MORE FROM AUTHOR

RELATED ARTICLES