గుట్కా స్కాం ప్రకంపనలు...మంత్రి, ఐపీఎస్ అధికారుల ఇళ్లపై సీబీఐ దాడులు

Submitted by arun on Wed, 09/05/2018 - 12:51
tn

గుట్కా కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు తమిళనాడులోని చెన్నైలో దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్ నివాసంతో పాటు మొత్తం 40చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా సీనియర్ అధికారులు, అధికార అన్నాడీఎంకే నేతల ఇళ్లపై దాడులు చేసిన సీబీఐ, పోలీస్ అధికారులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులను ముమ్మరం చేశారు.

తమిళనాడులో నిషేధిత గుట్కా అమ్మకానికి వాటి తయారీదారులు మంత్రి విజయ భాస్కర్, డీజీపీ రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్ తో పాటు మరికొంత మంది అధికారులకు సుమారు 40కోట్ల లంచాన్ని చెల్లించినట్లు ఐటీ శాఖ 2017లో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీ అశోక్ కుమార్ కు నివేదిక సమర్పించింది. వీరు గుట్కా మాఫియా నుంచి నెలకు 53 లక్షలు అందుకున్నట్లు కొన్నిపత్రాలు కూడా అప్పట్లో లభ్యమయ్యాయి. దీంతో ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్కా కుంభకోణంపై న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ కోసం సీబీఐ దాడులు నిర్వహించింది.

English Title
Tamil Nadu Minister, Top Cop Raided In Chennai In Gutka Scam

MORE FROM AUTHOR

RELATED ARTICLES