ఐపీఎస్ అధికారి కూతురు ‘అరాచకం’

Submitted by arun on Tue, 04/03/2018 - 12:20

తమిళనాడు అదనపు డీజీపీ తమిళ్‌సెల్వన్‌ కూతురు సోమవారం అర్ధరాత్రి చెన్నైలో హల్‌చల్‌ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఆమె.. తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌పై వీరంగం వేసింది. ‘నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్‌ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను’ అని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను హెచ్చరించింది. అంతేకాకుండా వెంటనే తండ్రికి ఫోన్‌ చేసి.. తనను ఆపిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించాలని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను ఆ కానిస్టేబుల్‌ చిత్రీకరించారు.

సోమవారం రాత్రి చెన్నైలోని పాలవక్కం బీచ్ ప్రాంతంలో తమిళనాడు అదనపు డీజీపీ కూతురు మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. ఆ సందర్భంగా తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి కానిస్టేబుల్‌ని విధుల నుంచి తప్పించాలని సూచించింది. ఈ తతంగాన్ని కానిస్టేబుల్ వీడియో తీయడంతో అది వైరల్ అయ్యింది. కమిషనరేట్‌కి వెళ్లి కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించాడని, వద్దని చెబుతున్నా వీడియో తీసి తమకు ఇబ్బంది కల్పించాడని, అతడిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

English Title
tamil nadu ADGP’s daughter caught in drunk and drive

MORE FROM AUTHOR

RELATED ARTICLES