ప్రపంచంలోనే టాలెస్ట్ లేడీ...

Submitted by arun on Mon, 08/13/2018 - 13:09
sophie hollins

పొడుగ్గా ఉంటే... భలే హైట్‌ ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం ప్రభాస్‌లా ఉన్నాడని, రానాను మరిపిస్తున్నాడని, అనుష్కకు అచ్చు గుద్దినట్టుగా కనిపిస్తున్నారని తెగ పొగిడేస్తారు. ఆరు అడుగుల అందగాడంటేనే అతివల మనసు ఆనందంలో తేలియాడుతుంటారు. హీరోలో, హీరోయిన్‌లో, ఇంకాస్త సెలబ్రేటీలో అయితే అదేపనిగా ఆసక్తిగా గమనిస్తాం.. పరిశీలిస్తుంటాం. సామాన్యుల వరకు వచ్చేసరికి కూడా అంతే ఇంట్రెస్ట్‌ని చూపిస్తుంటాం. ఇదీ అలాంటి కథే.

ఈ అమ్మాయి చూశారా? వామ్మో ఎంత పొడుగో అనుకుంటున్నారు కద. అవును ఓ రేంజ్‌ హైట్‌. పేరు సోఫీహోలిన్స్‌. వయసు పన్నెండేళ్లు. ఎత్తు ఆరు ఫీట్ల 2 అంగుళాలు. ఇప్పుడు సోఫీనే ప్రపంచంలోనే అత్యంత పొడగైన అమ్మాయి. ప్రీ టీనేజ్‌ బ్యాచ్‌లో ఇంత ఎత్తున్న అమ్మాయి ప్రపంచంలోనే లేదని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదైంది. ఫిజికల్‌ ఫీచర్స్‌ను బట్టి అమ్మాయి 5 అంగుళాల నాలుగు ఫీట్లు ఉంటేనే అరే జబర్దస్త్‌ హైట్‌ అనుకుంటాం. కానీ ప్రీ టీనేజ్‌ గ్రూప్‌ ఆఫ్‌‌లో సోఫీదే హై ఎస్ట్‌ హైట్‌.

సోఫీ ఇంట్లోకి వెళ్తే డైరెక్ట్‌గా సీలింగ్‌ తాకేస్తుంది. ఈ విషయాన్ని సోఫీనే చెబుతుంది. తనను అందరూ లేడీ టవర్‌ అంటుంటారని నవ్వుతూ అంటోంది. జెనెటిక్‌ డిజార్డర్‌ వల్లే ఈ అనూహ్య పెరుగుదల వల్ల తన తోటి విద్యార్థులతో గడపలేకపోతున్నానంటూ వాపోతోంది పాపం. ఇంట్లోనే కాదు స్కూల్‌లో, బయట కూడా ఇదే పరిస్థితి సోఫీది. స్కూల్‌ ఫ్రెండ్‌ అయితే జిరాఫీ అంటూ తనను ఆటపట్టిస్తుంటారని చెబుతున్న సోఫీ తాను అందరిలా అయితే బావుండేదంటూ ఓ రకమైన బాధతో కూడిన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. పాపం సోఫీ కద.

English Title
TALLEST GIRL IN THE WORLD 6ft 2in Sophie

MORE FROM AUTHOR

RELATED ARTICLES