మహంకాళి ఆలయం ముందు మహిళలపై వీరంగం

Submitted by arun on Mon, 06/18/2018 - 13:38

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను కూడా తీవ్రంగా చితకబాదాడు. ఇరు వర్గాల మహిళలు కూడా కొట్టుకున్నారు. ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్‌లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

English Title
Street Vendors Fight Outside Ujjain Mahakali Temple In Madhya Pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES