నటించింది చాలు ! ఇక ఆపు !

Submitted by arun on Thu, 05/24/2018 - 13:49
Thoothukudi

తమిళనాడు తూత్తుకుడిలో గురువారం మళ్ళీ ఉద్రిక్తత తలెత్తింది. స్టెరిలైట్ రాగి ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కాల్పుల్లో గాయపడిన 22 ఏళ్ళ కలియప్పన్ అనే వ్యక్తి కిందపడిపోయి బాధతో విలవిలలాడుతుండగా..అతడ్ని ఆసుపత్రికి తరలించాల్సిన పోలీసుల్లో ఒకరు.. ‘ నటించింది చాలు..ఇక ఆపు ..’ అంటూ కసురుకున్నాడు. స్థానిక రిపోర్టర్ ఒకరు దీన్ని వీడియో తీశాడు. కలియప్పన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

English Title
stop acting cop told wounded sterlite protester

MORE FROM AUTHOR

RELATED ARTICLES