సీఎం వాహనంపై రాళ్ల దాడి

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 11:04
stone-thrown-shivraj-singh-chauhan-vehicle-churhat

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళదాడి చేశారు. దీంతో సీఎం  వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఆదివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయింది. శివరాజ్‌సింగ్‌ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సిద్ధి జిల్లాలోని చుర్హట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేసిఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. అదృష్టవశాత్తు ఆయనకు ఏమి కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

English Title
stone-thrown-shivraj-singh-chauhan-vehicle-churhat

MORE FROM AUTHOR

RELATED ARTICLES