అన్నా- చెల్లిపై క‌థ‌నాలు..కంట‌త‌డిపెట్టిన క‌మ‌ల్

Submitted by lakshman on Fri, 03/02/2018 - 15:14
Sridevi And I Were Like Brother And Sister,' Says Kamal Haasan

 క‌మ‌ల్ హాసన్ ఎమోష‌న‌ల్ అయ్యారు. శ్రీదేవి- క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో కొన్ని సూప‌ర్ హిట్ చిత్రాలు వ‌చ్చాయి. దీంతో వారి కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్య పెరిగింది. అయితే శ్రీదేవి దుబాయ్ లో జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్లో మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణంపై స‌మాచారం తెలుసుకున్న క‌మ‌ల్ హాస‌న్ ఎమోష‌న‌ల్ అయ్యారు. తాను చెల్లిగా భావించే శ్రీదేవి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక పోతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. 
అంతేకాదు ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ - శ్రీదేవి ల బంధం గురించి కొన్ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం అవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ్రీదేవితో క‌లిసి గోరుముద్దలు తిన్నా. అలాంటిది త‌మ గురించి త‌ప్పుగా రాయ‌డం ఎంతో బాధించిందని అన్నారు.  అందుకు తమిళ మీడియా మినహాయింపు కాదు. తమిళ మీడియాలో కమల్, శ్రీదేవి గురించి అభ్యంతరకర కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలతో కమల్ హాసన్ అప్ సెట్ అయ్యారు. ఇలాంటి వార్తలని ఎలా సృష్టిస్తారు అని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీదేవి తనకు చెల్లెలు లాంటి వారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

శ్రీదేవి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. శ్రీదేవి అమ్మగారి గోరుముద్దల్ని తనుకూడా తిన్నానని, దయచేసి ఇలాంటి వార్తలని సృష్టించవద్దని కమల్ హాసన్ ఎమోషనల్ రిక్వస్ట్ చేసారు. శ్రీదేవి తుది శ్వాస విడిచి ఆరు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికి సినీలోకం, అభిమానాలు ఆమె జ్ఞాపకాలలోనే ఉన్నారు.
 శ్రీదేవి అంతిమయాత్రలో సంయమనంతో విధు లు నిర్వర్తించిన ముంబై పోలీసులకు నటుడు అనిల్ కపూర్ కృతజ్ఞతలు తెలిపారు. కడసారి నివాళులర్పించే సమయంలో మాకు అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. దహనసంస్కారాలు జరిగినప్పుడు మా ఏకాంతానికి భంగం కలుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నందుకు ముంబై పోలీసులకు కృతజ్ఞతలు అని అనిల్ కపూర్ ఒక ప్రకటనలో తెలిపారు.

English Title
Sridevi And I Were Like Brother And Sister,' Says Kamal Haasan

MORE FROM AUTHOR

RELATED ARTICLES