తిరుపతిలో విషాదం...

Submitted by arun on Wed, 09/05/2018 - 14:37
Suicide

ఆర్ధిక ఇబ్బందులు తాళ లేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పర్సాల వీధికి చెందిన లీలా కుమారి  పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. లీలాకుమారి కుమారుడు గంగాధర్‌  టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గంగధార్ రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పులు భారీగా పెరిగిపోవడంతో  తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరి నిమిషంలో రుయా ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు. అయితే కుమారుడు మృతిని తట్టుకోలేని తల్లి లీలాకుమారి ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్ధానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తా, భర్త దూరం కావడంతో నవ వధువు కన్నీరుమున్నీగా విలపించింది.  

Tags
English Title
son and mother committed suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES