బండ కింద పాముల పుట్ట

Submitted by arun on Sat, 03/31/2018 - 13:06

ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో పాముల పిల్లలు. అది కూడా ఒకే బండరాయి కింద బయటపడ్డాయ్. వందల సంఖ‌్యలో పాములను చూసిన గ్రామస్తులే విస్తుపోవాల్సి పరిస్థితి ఎదురైంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌కు చెందిన మొగులప్ప సోదరుడికి కాలు విరగడంతో ఇంటి ముందున్న బండరాయిపై చెట్ల పసురు తీస్తుండగా ఓ పాము బయటికి వచ్చింది. 

బండరాయి కింది నుంచి పామును ఉషణ్ణప్ప కొట్టి చంపారు. మళ్లీ అదే బండరాయి కింద నుంచి మరో పాము రావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బండరాయిని తీసి చూడటంతో వందల సంఖ‌్యలో పాము పిల్లలు బయటపడ్డాయ్. గ్రామస్తులకు కూడా పాముల విషయం తెలియడంతో అందరూ కలిసి పాములను చంపేసిన తర్వాత కిరోసిన్ పోసి తగులబెట్టారు. 

English Title
snakes found under stone

MORE FROM AUTHOR

RELATED ARTICLES