గుజరాత్ సీఎం రేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ?

Submitted by arun on Tue, 12/19/2017 - 11:55
Smriti Irani

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం మళ్లీ ఆలోచనలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా.. అతడిని రెండోసారి కంటిన్యూ చేసేందుకు బీజేపీ పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. అందుకే అతడి స్థానంలో మంచి జనాధరణ పొందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

గుజరాతీలో బాగా మాట్లాడగలిగే నేర్పుతోపాటు, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన ఆమెను సీఎం పీఠంపై కూర్చోబెడితే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు ఎదురుండదని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన పటీదార్ అయిన మన్‌సుఖ్ ఎల్ మాండవ్య పేరును కూడా పరిశీలిస్తున్నారు. రైతు పక్షపాతిగా పేరున్న ఆయన పేరు ముఖ్యమంత్రి రేసులో రెండో స్థానంలో ఉండగా, సీనియర్ నేత, పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన వాజుభాయ్ వాలా మూడో స్థానంలో ఉన్నారు.

English Title
Smriti Irani leading in race to be next Gujarat Chief Minister?

MORE FROM AUTHOR

RELATED ARTICLES