అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు

Submitted by arun on Mon, 12/25/2017 - 14:21
AIADMK

తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆరుగురు నేతలకు ఆ పార్టీ పెద్దలు ఉద్వాసన పలికారు. పార్టీ సీనియర్ నేతల సమావేశమైన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం కలిసి ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరుగురు నేతలను పార్టీ నుంచి తొలగించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్, పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ గెలుపొందిన విషయం విదితమే.

English Title
six leaders removed from AIADMK

MORE FROM AUTHOR

RELATED ARTICLES