ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెద్దల మందలింపుతో...

Submitted by arun on Fri, 06/29/2018 - 13:27
love

మైనర్లైన వారు వరుసకు అన్నాచెల్లెలు. కానీ, ప్రేమించుకున్నామని వారు చెప్పడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో రైలుకింద పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు. దీంతో మనస్థానం చెందిన ఇద్దరు బుధవారం మామూలుగానే స్కూలుకు వెళ్లారు. అక్కడ నుంచి తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని వారు నోట్‌లో రాసినట్టు పోలీసులు పేర్కొన్నారు
 

English Title
Sister and brother love affair

MORE FROM AUTHOR

RELATED ARTICLES