సీబీఐ డైరెక్టర్‌ వివాదంలో కీలక మలుపు

సీబీఐ డైరెక్టర్‌ వివాదంలో కీలక మలుపు
x
Highlights

రచ్చకెక్కిన సీబీఐ అధినాయకుల వర్గ పోరు మరో మలుపు తిరిగింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్ ఆస్తానాలను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ...

రచ్చకెక్కిన సీబీఐ అధినాయకుల వర్గ పోరు మరో మలుపు తిరిగింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్ ఆస్తానాలను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. కేంద్ర ఆదేశాలను సవాలు చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక ఆదేశాలిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, సీవీసీలకు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ డైరెక్టర్‌ వివాదం కీలక మలుపు తిరిగింది. అర్ధరాత్రి వేళ తన అధికారాలను తొలగించి, సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు సీబీఐ, సీవీసీలకు నోటీసులు జారీ చేసింది. అలోక్ వర్మ, ఆస్తానాపై వచ్చిన ఆరోపణలపై 10రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌‌ను సీజేఐ ఆదేశించారు. దర్యాప్తు మొత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో జరగాలని స్పష్టం చేసింది. మరోవైపు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర్రావు తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే అక్టోబర్ 23 తర్వాత తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయరాదని తెలిపింది. మొత్తం దర్యాప్తు నివేదికను నవంబర్‌ 12న సీల్డ్‌ కవర్‌లో తమకు సమర్పించాలన్న త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను అదే రోజుకి వాయిదా వేసింది.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ తరపున సీనియర్ న్యాయవాది ఎఫ్‌ఎస్‌ నారిమన్ వాదనలు వినిపించారు. చట్టాలకు వ్యతిరేకంగా అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ ఆదేశాలు జారీ చేశాయని కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై 10రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ను ఆదేశించింది. అయితే ఈ కేసులో చాలా పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున దర్యాప్తునకు 10రోజుల సమయం సరిపోదని సీవీసీ విన్నవించింది. దాంతో గడువును రెండు వారాలకు పెంచుతూ తదుపరి విచారణను నవంబర్ 12కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories