అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37
chaisam

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.

ట్వీట్‌ చూసిన సమంత వెంటనే స్పందించారు. అయ్యో.. ఆ స‌మ‌యంలో నేను ఏడ‌వ‌లేదు. నా క‌ళ్ళ‌కి ఇన్‌ఫెక్ష‌న్ సోకింది అని కామెంట్ పెట్టింది. ఇక‌ ఈ కార్య‌క్ర‌మంకి స‌మంత ఫుల్ లెన్త్ లెహంగా ధ‌రించి హాజ‌రు కాగా, అక్కినేని వారి కొత్త కోడ‌లిని చూసి అభిమానులు మురిసిపోయారు. సమంత ప్ర‌స్తుతం మ‌హాన‌టి చిత్రంతో పాటు రంగ‌స్థ‌లం చిత్రాలు చేస్తుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్ట్స్ చేస్తుంది. 
 

English Title
samantha respond on pre release event issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES