చిన్మ‌యిని బాధ‌పెట్టిన స‌మంత‌

చిన్మ‌యిని బాధ‌పెట్టిన స‌మంత‌
x
Highlights

అవ‌కాశం దొరికిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంటూనే ఉంది స‌మంత‌. తొలి చిత్రం 'ఏమాయ చేసావె' మొద‌లుకొని 'ఈగ‌', 'ఎటో వెళ్లిపోయింది...

అవ‌కాశం దొరికిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంటూనే ఉంది స‌మంత‌. తొలి చిత్రం 'ఏమాయ చేసావె' మొద‌లుకొని 'ఈగ‌', 'ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు', 'మ‌నం', 'అఆ' చిత్రాల వ‌ర‌కు త‌న ప్ర‌తిభ‌ని చూపించే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యింది ఈ అమ్మ‌డు.

ఇక తాజా చిత్రం 'రాజుగారి గ‌ది2'లోనూ అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది స‌మంత‌. సినిమాలో ఆత్మ పాత్ర‌లో క‌నిపించి భ‌య‌పెట్ట‌నున్న‌ స‌మంత‌.. కొన్ని హార్ట్‌ట‌చింగ్ సీన్స్‌లోనూ క‌నిపించి గుండెల్ని పిండేస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజ్‌ ఫంక్ష‌న్‌లో సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ చెప్ప‌గా.. తాజాగా డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి కూడా ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చింది.

స‌మంత‌కి రెగ్యుల‌ర్ గా డ‌బ్బింగ్ చెప్పే చిన్మ‌యి.. 'రాజుగారి గ‌ది2'కి అయితే డ‌బ్బింగ్ చెపుతూ ఏడ్చేసింద‌ట‌. అంత‌గా ఆ పాత్ర‌ని స‌మంత ర‌క్తిక‌ట్టించింద‌ని చిన్మ‌యి తెలిపింది. నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'రాజుగారి గ‌ది2' అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. దీనికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories