బిగ్‌బాస్‌ హౌజ్‌లో మెగా హీరో

Submitted by arun on Thu, 07/05/2018 - 13:50
Sai Dharam Tej

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. 100 రోజుల పాటు ఆడియన్స్ కు వినోదాన్ని పంచనున్న బిగ్ బాస్ హౌస్.. సినిమా ప్రమోషన్లకు అడ్డాగా మారిపోయింది. ఆ మధ్యన జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. దానికి సంబందించి ప్రోమోని విడుదల చేశారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్‌ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ‘నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?’ అని అంటే.. తేజ్‌ ‘నేను రావడమే ఎక్కువ ఇంకా కేక్‌ కూడానా?’ అని​ బదులివ్వడం బాగానే పేలింది. సామ్రాట్‌ను ఉద్దేశించి... బౌలింగ్‌ కూడా బాగానే వేస్తున్నావట అని అనడం.. తనీష్‌ను ఉద్దేశించి వేసిన పంచ్‌లు వీడియోలో ఉన్నాయి. అనుపమా పాట పాడటం ఇలా ఈరోజంతా సరదాగా గడిచేట్టుంది బిగ్‌బాస్‌ ఇంట్లో. 
 

English Title
saidharam tej anupama parameswaran at bigg boss house

MORE FROM AUTHOR

RELATED ARTICLES