చిరూ లుక్ మారింది..డౌట్లు పెరిగాయ్

Submitted by arun on Wed, 01/03/2018 - 21:07

సైరా సినిమా గురించి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త నిజ‌మేన‌ని సంకేతాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం సైరా డైర‌క్ట‌ర్ విష‌యంలో చిరంజీవి అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల్ని నిజం చేసేలా మెగ‌స్టార్ గుబురు గ‌డ్డెం తీసేసి, ఫ్రెష్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.  
 దాదాపు 9 ఏళ్ల‌ త‌రువాత వెండితెర‌పై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి త‌న 150వ చిత్రం ఖైదీ నెం 150తో అద‌రగొట్టారు. దీంతో 151వ‌ సినిమా  పై అభిమానుల్లో అంచ‌నాలు పెరిగాయి. ఆ అంచ‌నాలకు అనుగుణంగా మెగ‌స్టార్ ప్ర‌ముఖ ఉద్య‌మ కారుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని తెర‌కెక్కించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ సినిమాను రాంచ‌ర‌ణ్ నిర్మాత‌గా, సురేంద‌ర్ రెడ్డి డైర‌క్ట‌ర్ గా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌కి వెళ్ల‌డానికి రెడీ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌ర్లో రెండో షెడ్యూల్ ఉంటుంద‌ని తెలుస్తుంది. 
ఇదిలా ఉంటే సైరా టేకింగ్ విష‌యంలో అసంతృప్తిగా ఉండ‌డంతో  వేరే ద‌ర్శ‌కుడిని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ని వ‌స్తున్న వార్త‌లు నిజ‌మేనా, సైరా షెడ్యూల్ షూటింగ్ డిలే కానుందా.. ఇలా ఎన్నో వార్త‌లు అభిమానుల మ‌తులు తొలుస్తున్నాయి. అయితే రెండో షెడ్యూల్‌కి రెండు నెల‌లు టైం ఉంది కాబ‌ట్టి, చిరు మ‌ళ్లీ పాత గెట‌ప్‌లోకి రావ‌డానికి ఈ టైం చాలని మెగా స‌న్నిహితులు అంటున్నారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అన్ని పుకార్ల‌ని వాళ్లు కొట్టి పారేస్తున్నారు.

English Title
Rumours on over Chiranjeevi Sye Raa Narasimha Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES