సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Mon, 06/04/2018 - 10:29
Road Accident

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమరబండ బైపాస్‌ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ, సౌజన్యలుగా గుర్తించారు.. 

English Title
Road Accident in suryapet

MORE FROM AUTHOR

RELATED ARTICLES