జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Wed, 06/06/2018 - 14:30
Road Accident

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకుడూరు గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. గ్రామ సమీపంలోని వంతెన వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English Title
Road Accident in jagityal dist

MORE FROM AUTHOR

RELATED ARTICLES