సిద్దిపేటలో జర్నలిస్ట్‌ కుటుంబం ఆత్మహత్య

Submitted by arun on Thu, 06/21/2018 - 16:15
suicide

పెద్దలు చేసిన తప్పులకు చిన్నారులు శిక్ష అనుభవిస్తున్నారు. వందేళ్లు వర్దిల్లాలని ఆశీర్వదించాల్సిన చేతులే విషమిచ్చి చంపేస్తున్నాయ్. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న పిల్లలను కనికరం లేకుండా ప్రాణాలు తీస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన కుటుంబసభ్యులే భక్షకులవుతున్నారు. 

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. కన్న తండ్రే...తన ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశారు. తండ్రి చేసిన అప్పులకు ఇద్దరు చిన్నారులు బలయ్యారు. వెలికట్ట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన హనుమంతరావుకు భార్య మీనాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేపల్లి గ్రామం నుంచి కుటుంబాన్ని తీసుకొచ్చి సిద్ధిపేటలో పెట్టారు. హనుమంతరావు స్థానిక రిపోర్టర్‌గా ఓ పత్రికలో పని చేస్తున్నారు. దుద్దెడలో ఇంటర్‌నెట్‌ సెంటర్‌, గజ్వేల్‌లో సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ షాపులను నడుపుతున్నారు. ఈ రెండు వ్యాపారాల్లోనూ హనుమంతరావుకు నష్టాలే వచ్చాయ్. తీసుకున్న డబ్బుతో పాటు వడ్డీ చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు వెంటపడ్డారు. డబ్బు చెల్లించలేక, మెంటల్ టెన్షన్‌‌ను తట్టుకోలేక చావాలనే డిసైడ్ అయ్యాడు.

ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన హనుమంతరావు, భార్యతో పాటు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పిల్లలతో పాటు హనుమంతరావు చనిపోయారు. ఆత్మహత్య విషయాన్ని ఉదయాన్నే గుర్తించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న భార్య మీనాను ఆసుపత్రికి తరలించారు. హనుమంతరావు భార్య మీనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని సిద్దిపేట పోలీసులు తెలిపారు. చేసిన అప్పుల కోసం చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Tags
English Title
reporter commits suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES