కొండగట్టు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన కండక్టర్
x
Highlights

కొండ గట్టు ప్రమాదానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమని ఆ బస్సు కండక్టర్ తెలిపారు. మొన్నటి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు...

కొండ గట్టు ప్రమాదానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమని ఆ బస్సు కండక్టర్ తెలిపారు. మొన్నటి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ ప్రమాద సమయంలో పరిస్థితి గురించి వివరించారు. ప్రమాదానికి ముందు మూడు స్పీడ్ బ్రేకర్లు వచ్చాయని అప్పుడు బ్రేక్ వేస్తే బస్సు కంట్రోల్ అవ్వలేదని కండక్టర్ చెప్పారు. స్పీడ్ బ్రేకర్లు దాటాక బస్సు వేగం మరింత పెరిగిందని తెలిపారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయో..గేరు న్యూట్రల్ ‌లో ఉందో తెలియదని అన్నారు. ఆ మరుక్షణమే బస్సు వేగంగా లోయలోకి దూసుకెళ్ళిందని కండక్టర్ తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో వంద మందికిపైనే ఉన్నారని కండక్టర్ చెప్పారు. బస్సులో 96 మందికి టిక్కెట్లు ఇచ్చానని వివరించారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యాకే ఘాట్ రోడ్డులో బస్సు నడుపుతున్నామనీ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు ఆ రూట్‌లో సర్వీసు నడుస్తోందని కండక్టర్ తెలిపారు. నెల రోజులు నుంచి కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు నడుస్తున్నట్లు కండక్టర్ తెలిపారు. డ్రైవర్‌కు ఘాట్ రోడ్డు కొత్తేమీ కాదనీ ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయో ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో బాగా తెలుసని వివరించారు. ప్రయాణానికి ముందు బస్సుకు ఫిట్ నెస్ తనిఖీలు చేశారో లేదో తనకు తెలియదని కండక్టర్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories