డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

x
Highlights

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త...

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ.

శ్రీరెడ్డి ఎపిసోడ్‌తో వర్మ... బ్రోకర్‌ అవతారమెత్తాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబుకుమారుడు అభిరాం, శ్రీరెడ్డి వివాదంలో సెటిల్‌మెంట్‌ కోసం ప్రయత్నించాడు. అభిరాం వ్యవహారంలో సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని శ్రీరెడ్డికి సూచించిన రాంగోపాల్‌ వర్మ దగ్గుబాటి సురేష్‌బాబు నుంచి 5కోట్ల రూపాయలు ఇప్పిస్తానని భారీ ఆఫర్‌ ఇచ్చాడు. అయితే ఈ ఆఫర్‌‌ను శ్రీరెడ్డి తిరస్కరించిందని, ఓ చిన్న ఆర్టిస్ట్‌ అంత పెద్ద ఆఫర్‌‌ను రిజక్ట్‌ చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందంటూ చెప్పుకొచ్చాడు.

మరి రాంగోపాల్‌ వర్మ తనంతట తానుగా బ్రోకర్‌గా మారాడో లేక దగ్గుబాటి సురేష్‌బాబు ఆ పని అప్పగించారో తెలియదు కానీ వర్మ మాత్రం తనంతట తానుగానే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయాలేమీ దగ్గుబాటు సురేష్‌బాబుకి తెలియనే తెలియవన్నారు.

అయితే క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని వర్మ చెప్పుకొచ్చాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఆ సలహా ఇచ్చానన్నాడు. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనన్నాడు. కేసీఆర్, పవన్ కల్యాణ్ కూడా పలుమార్లు విమర్శించుకున్నారని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారని గుర్తుచేశాడు. రాజకీయ నేతలు చేసే పనినే తాను చేశానంటూ చెప్పుకొచ్చాడు.

తాను చెప్పినట్టు చేస్తే అందరి దృష్టి ఉద్యమం వైపు మళ్లుతుందని శ్రీరెడ్డికి చెప్పినట్లు వర్మ అంగీకరించాడు. అంతేకాదు ఆ పదంతో పవన్‌ను తిట్టమని శ్రీరెడ్డికి చెప్పింది తానేనన్నాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా మహేశ్ కత్తి పాపులర్‌ అయ్యాడని శ్రీరెడ్డికి చెప్పానని వర్మ అన్నాడు.

రాంగోపాల్‌వర్మకు బన్నీ వాసు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చాడు. నీ సంగతేంటో తేలుస్తాం యుద్ధానికి రెడీగా ఉండంటూ అల్టిమేటం ఇచ్చాడు. క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇష్యూలోకి పవన్‌ కల్యాణ్‌ను లాగమని శ్రీరెడ్డికి తానే చెప్పానని వర్మ చెప్పడంతో బన్నీ వాసు తీవ్ర హెచ్చరికలు పంపాడు. మెగా అభిమానుల సత్తా ఏంటో వర్మకు రుచి చూపిస్తామన్నాడు. మెగా ఫ్యామిలీ మద్దతుదారులంతా ఈరోజు సమావేశమవుతున్నట్లు తెలిపిన బన్నీ వాసు సాయంత్రం తమ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామని చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories