మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు

Submitted by arun on Fri, 02/02/2018 - 10:25
Ram Charan Upasana

టాలీవుడ్ లో 2018 మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ను మొదట అనుష్క అందుకుందనే చెప్పాలి. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు భాగమతి సంతృప్తి పరచిందనేది ప్రస్తుతం టాలీవుడ్ నడుస్తున్న హాట్ టాపిక్. అంతే కాకుండా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు సినిమా మంచి లాభాలను అందించింది. ముఖ్యంగా సినిమాలో అనుష్క నటన బాగా క్లిక్ అయ్యింది. అందుకు తగ్గట్టు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కూడా హర్రర్ స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

అయితే సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా చూశారు. కొందరైతే స్పెషల్ షో వేసుకొని మరి చూశారు. ఇక రీసెంట్ గా రామచరణ్‌ తన సతీమణి ఉపాసనతో కలిసి గురువారం రాత్రి ‘భాగమతి’ సినిమా చూశారట. ఈ విషయాన్ని చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘నిన్న రాత్రి నేను, ఉపాసన ‘భాగమతి’ సినిమా చూశాం. మైండ్‌ బ్లోయింగ్‌. చిత్రంలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా పనిచేశారు. కంగ్రాట్స్‌. ‘భాగమతి’ చూసి మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు’ అంటూ సరదాగా పోస్ట్‌ చేశారు.

ఈ సినిమాపై ఉపాసన కూడా కామెంట్‌ చేశారు. ‘నిజమే. ఓ మై గాడ్‌. సినిమా చూస్తున్నంతసేపు సీటు చివరిలో కూర్చున్నాను. రాత్రంతా నిద్రపట్టలేదు. తప్పకుండా మీరూ సినిమా చూడండి’ అని ట్వీట్‌ చేశారు.

English Title
Ram Charan appreciates Bhaagamathie

MORE FROM AUTHOR

RELATED ARTICLES