రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా..234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ : ర‌జ‌నీ కాంత్

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా..234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ : ర‌జ‌నీ కాంత్
x
Highlights

రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజ‌నీకాంత్‌ తెరదించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించారు. కొద్దిరోజుల క్రితం 2.0 విడుదలైన తరువాత...

రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజ‌నీకాంత్‌ తెరదించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించారు. కొద్దిరోజుల క్రితం 2.0 విడుదలైన తరువాత రెండు నెలలకు పా రంజిత్ తీసే కాలా విడుదల త‌రువాత‌ ఏమవుతుందో దేవుడికే తెలియాలి అన్న ర‌జినీ వ్యాఖ్య‌ల్నిఆయ‌న ఇక సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ బోతున్నారాని సినీ విశ్లేష‌కులు, ఆయ‌న అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. వారి అభిప్రాయాల‌కు అనుగుణంగానే కొద్దిసేప‌టి క్రితం త‌న అభిమానుల సమ‌క్షంలో తాను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోగా కొత్త పార్టీని స్థాపిస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డబ్బు, పదవి ఆశతో రాజకీయాల్లోకి రావడం లేదని పున‌రుద్ఘాటించారు. ఈ సంద‌ర్భంగా దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని... వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు.

ఇదిలా ఉంటే ర‌జినీ ఆరు రోజుల పాటు అభిమానుల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్ర‌వేశంపై డిసెంబ‌ర్ 31న ప్ర‌క‌టిస్తాన‌న్న ఆయ‌న‌, సినీ రంగంలో ఎదిగిన తీరు. సూప‌ర్ స్టార్ గా మ‌లిచిన ద‌ర్శ‌క, నిర్మాత‌ల్ని కొనియాడారు. అయితే చివరిరోజు అయిన ఆదివారం రోజు ల‌క్ష‌మంది అభిమాన సంఘాలు , ట్విట్టర్లో 44 లక్షల మంది ఫాలోవ‌ర్స్ ర‌జినీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తార‌ని చెప్ప‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories