ఉత్కంఠ రేపుతున్న రజనీకాంత్ పొలిటికల్‌ ఎంట్రీ

Submitted by arun on Tue, 12/26/2017 - 09:51
Rajinikanth

తలైవా మనసులో మాట చెబుతాడా ? రాజకీయ ఆరంగేట్రంపై నిర్ణయం ప్రకటిస్తాడా ? రాజకీయాల్లోకి వస్తే ఏదైనా పార్టీలో చేరుతాడా ? లేదంటే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలకు వెళతాడా ? పాలిటిక్స్‌లోకి ఎంటరై...చరిత్ర సృష్టిస్తాడా ? లేదంటే చరిత్రలో కలిసిపోతాడా ? రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టీ నుంచి మరోసారి అభిమానులతో సమావేశానికి రెడీ అవుతున్నారు. 

ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి అభిమానులతో సమావేశం కానున్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఇవాళ్టీ నుంచి ఆరు రోజుల పాటు అభిమానులతో సమావేశం కానున్నారు. ప్రతి రోజు నాలుగు లేదా ఐదు జిల్లాల అభిమానులతో ఆయన భేటీ అవుతారు. గత మే నెలలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు రజనీకాంత్‌.

అయితే రాజకీయాలపై తలైవా మనసులో ఏముందో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. ఎప్పుడో ఒకసారి రాజకీయాలపై స్పందించడం, అంతలోనే ఉసూరు మనిపించడం ఏళ్లుగా కొనసాగుతోంది. దీంతో మరోసారి అభిమానులతో సమావేశం కాబోతుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చమొదలైంది. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న తలైవా రాజకీయాల్లోకి వచ్చేందుకు సంకోచించడం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది.

English Title
Rajinikanth Meets Fans In Chennai

MORE FROM AUTHOR

RELATED ARTICLES